గుంటూరు: నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్ పరిసర ప్రాంతాల మాస్ క్లీనింగ్ మరియు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురు గల టాయ్ లెట్స్ ను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి మేయర్ పరిశీలించి తదుపరి విజ్ఞాన మందిరం వద్ద అధికారులు సిబ్బంది చే స్వచ్చ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ చేయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో చిన్న పల్లెటూరు నుండి పెద్ద నగరంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలనే ఉద్దేశ్యంతో సి.యం గారు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నగర ప్రజలకు పారిశుద్య లోపాల వలన కలరా వంటి అంటు వ్యాధులు రాకుండా నగరంలో ఎప్పటికప్పడు గార్బేజ్ కలెక్షన్, డ్రైన్స్ క్లీనింగ్, పత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నగరంలోని అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరు గా తీర్చి దిద్దటానికి కృషి చేస్తున్నామని, దీనికి నగర ప్రజలు మరియు ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఈ సంవత్సరం కూడా స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి మంచి ర్యాంకు వచ్చేలా చేసి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటామని తెలియచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ స్వచ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం నుండి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తునారని, దీని ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్ మార్చాలనే సంకల్పంతో చేస్తున్నారన్నారు. స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ఈ నెల థీం జీరో గ్యాప్ శానిటేషన్ అనే అంశం పై నిర్వహిస్తున్నామని, పారిశుధ్య కార్యక్రమాలు ఎన్ని చేసిన ఎక్కడో ఒక చోట గ్యాప్ ఉంటుందని ఇటువంటి గ్యాప్ లను గుర్తించి, అటువంటి ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరంలో ఇప్పటికే డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లలో గ్యాంగ్ వర్క్ లు, డ్రైన్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలు చేయుటయే కాక, తడి పొడి చెత్తల విభజన పై, పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రత పై కూడా ప్రజలకు అవగాహన కూడా కల్గిస్తున్నామని తెలియచేశారు. ఇటువంటి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, కావున ప్రజలు కూడా ఈ స్వచ్చ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియచేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎస్ఈ జి. వెంకటేశ్వర రావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, టి. వెంకట కృష్ణయ్య, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, నగర పాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.