ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీ విరాళాలు వెల్లువెత్తాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కుటుంబంతో కలిసి రూ. 21.63 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన రైడాన్ టెక్నాలజీస్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు రూ. 20 లక్షలు విరాళంగా అందించాయి. గతంలోనూ పలువురు భక్తులు, సంస్థలు టీటీడీ ట్రస్టులకు భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన రోజు నుంచి వరుసగా విరాళాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరు భారీ విరాళాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, వారి కుటుంబసభ్యులతో కలిసి భారీ విరాళాన్ని ఇచ్చారు.. ఈ మేరకు ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ‘ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల లోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొన్న తదుపరి తిరుమల JEO క్యాంపు కార్యాలయం నందు JEO వెంకన్న చౌదరి గారికి ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, వారి కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం కార్యక్రమంకు 21,63,740 రూపాయలను స్వామి వారికి విరాళం ఇవ్వడం జరిగింది’ అని తెలిపారు. అంతకముందు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

About The Author