కర్నూలు: నగరంలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు మాంసపు విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసపు దుకాణాలు, తాత్కాలిక విక్రయ కేంద్రాల్లో మాంసం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం దేశ గౌరవానికి సంబంధించిన ముఖ్యమైన రోజు కావడంతో ప్రజలంతా సహకరించాలని, నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు. కావున సోమవారం ఎలాంటి మాంసపు విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు.

About The Author