అనంతపురం నగరపాలక సంస్థ<: నగరపాలక సంస్థలో అమలు చేస్తున్న చిత్రగుప్త (Chitragupta) మొబైల్ యాప్ ను మరింత అభివృద్ధి పరచడం ద్వారా పౌరులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే అంశంపై విస్తృతంగా చర్చించారు.

పౌరులకు సేవలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా సులభతరం చేసేందుకు గాను, ఈ క్రింది సేవలను యాప్ నందు అనుసంధానం చేయాలని ప్రణాళికలు రూపొందించారు.

యాప్ నందు అనుసంధానం చేయనున్న సేవలు:
1. ఆస్తి పన్ను
2. వర్తకపు పన్ను
3. ప్రకటనలు / హోర్డింగులు
4. ఆక్రమణలు
5. ఘన వ్యర్థాల నిర్వహణ
6. ఫుట్ పాత్
7. డివైడర్
8. మ్యాన్ హోల్
9. వేలాడుతున్న విద్యుత్ తీగలు
10. వీధి దీపాలు / ట్రాఫిక్ లైట్లు
11. గుంతలు / నీరు నిల్వ / రోడ్డు పగుళ్లు

ఈ సమీక్షా సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ ఓంకార్, మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ రాజా రవీంద్రనాథ్ చౌదరి పాల్గొన్నారు.

About The Author