
♦️గుంటూరు : ఆస్తి, ఇతర పన్నులు చెల్లించుటకు వీలుగా, మంగళవారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
♦️ ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మంగళవారం సెలవు రోజైనప్పటికీ జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో నగర పాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను చెల్లించవచ్చన్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరం పన్ను ఏక మొత్తంగా చెల్లిస్తే అసలులో 5శాతం రాయితీతో, 2025-26 ఆర్థిక సంవత్సరం బకాయి ఏక మొత్తంగా చెల్లిస్తే దాని వడ్డీపై 50శాతం రాయితీతో పన్ను చెల్లించవచ్చని తెలిపారు.