ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు “ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026 పై అవగాహన” అనే ప్రధాన అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి 2026 ఘన వ్యర్ధాల నిర్వహణకు నూతన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయని, సదరు మార్గదర్శకాల పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్త్రుతంగా నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ఇందులో భాగంగా 5వ తారీఖున ఘన వ్యర్ధాల నిర్వహణ పై ప్రజారోగ్యాదికాలకు, ప్రజారోగ్య కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించామని తెలియచేశారు. అదేవిధంగా నేడు 6న ఘన వ్యర్థాల నిర్వహణ పై నగరంలో ఏటుకూరు రోడ్డులోని కంపోస్టింగ్ యూనిట్ మరియు మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (యం.ఆర్.యఫ్) లకు ఎక్స్‌పోజర్ విజిట్ చేయుట జరిగిందని, అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 పై శిక్షణా కార్యక్రమం మరియు వర్క్‌షాప్ నిర్వహించబడిందన్నారు. అనంతరం జూన్ 7 నుండి 12వ తారీఖు వరకు నగరంలో డివిజన్ల వారీగా విస్తృత స్థాయిలో మొక్కల నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు.
సదరు కార్యక్రమాలు నిర్వహించుట ద్వారా, పర్యావరణ పరిరక్షణ, తడి పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించి, సదరు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ మరియు గ్రీనరి అభివృద్ధి పై పట్ల ప్రజల్లో అవగాహన పెరిగి గుంటూరు నగరం క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుట జరుగుతుందన్నారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, విఏయస్ డాక్టర్ నాగేశ్వర రావు, ఏడిహెచ్ శాంతి, యస్.యస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

About The Author