భీమవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్
భీమవరం: స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగ బల్క్ వేస్ట్ జనరేటర్లపై స్థానికులకు అవగాహన కల్పించారు.
దేవాలయాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, విద్యాసంస్థల, ఇతర బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను మూలస్థాయిలోనే తడి, పొడి చెత్తగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని అధికారులు సూచించారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలు పర్యావరణ పరిరక్షణలో బల్క్ వేస్ట్ జనరేటర్ల బాధ్యతలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలోపుల్పాలక సంఘ ఆయా విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దేవస్థానం ధర్మకర్తల మండలి పాల్గొన్నారు.