అనధికార ఫ్లెక్సీల తొలగింపు, రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచితే జరిమానాలు: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ
కాకినాడ, జూన్ 6: కాకినాడ నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామగ్రిని ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ హెచ్చరించారు.
శనివారం ఉదయం నగరంలోని 5వ డివిజన్ పేర్రాజుపేట ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ్య సేవలపై వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు.
పర్యటన సందర్భంగా పలు వీధుల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని రహదారులపై నిల్వ ఉంచిన విషయాన్ని కమిషనర్ గమనించారు. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న భవన యజమానులపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం వివేకానంద పార్క్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ సందర్శించి అక్కడి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత విధుల్లో ఉండాల్సిన కార్పొరేషన్ సిబ్బంది గైర్హాజరుగా ఉన్నట్లు గుర్తించిన ఆయన, బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సౌందర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసే అనధికార ఫ్లెక్సీలను తొలగించే ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామగ్రిని ఉంచినట్లయితే జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.