# ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్రయల్ రన్
అనంతపురం:
నగరంలో పారిశుధ్య పనులను పూర్తి పారదర్శకంగా, రియల్ టైమ్ పర్యవేక్షణతో చేపట్టేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ను కమీషనర్ జశ్వంత రావు ట్రయల్ రన్ వేశారు.ICCC లక్ష్యం
చెత్త సేకరణ నుంచి డ్రైనేజీ శుభ్రత వరకు అన్ని పారిశుధ్య పనులను ఒకే వేదిక నుంచి పర్యవేక్షించడం, ప్రజల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వడం,ప్రతి పనికి జవాబుదారీతనం పెంచడం ICCC ప్రధాన ఉద్దేశం.
ట్రయల్ రన్ షెడ్యూల్
రానున్న 7 రోజుల పాటు ICCC వ్యవస్థను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు.. సాంకేతిక సర్దుబాట్లు పూర్తయిన తర్వాత గౌరవ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే , మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి చేతుల మీదుగా ICCC అధికారిక ప్రారంభోత్సవం జరుగుతుంది.
ప్రజలకు కొత్త సౌకర్యం
నగరంలోని 74 సచివాలయాల్లో ప్రత్యేక డిజిటల్ మ్యాపులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలోని మరో రెండు మ్యాపులు ప్రజలు సులభంగా చూసేలా వీటిని అందుబాటులో ఉంచారు.
ఈ మ్యాపుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు
1.వెహికల్ ట్రాకింగ్ చెత్త సేకరణ వాహనం ప్రస్తుతం మీ వీధిలో ఉందా లేదా
2. వర్కర్ లొకేషన్: శానిటేషన్ వర్కర్ ఏ పాయింట్ లో పని చేస్తున్నారు
3. డ్రైన్ క్లీనర్ వివరాలు మీ ఏరియాలో డ్రైన్ శుభ్రత పనులు జరుగుతున్నాయా
4. డైరెక్ట్ కాంటాక్ట్ సమస్య ఉంటే వెంటనే సంప్రదించడానికి శానిటేషన్ సెక్రటరీ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్లు మ్యాప్ లో పొందపరచడం జరిగింది
*ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం *
పారిశుధ్య సమస్య ఏదైనా ఉంటే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 2401 కు ఉదయం 6.00 గంటలు నుండి మద్యాహ్నం 2.00 గంటలు వరకు ఒక బ్యాచ్ మద్యాహ్నం 2.00 గంటలు నుండి రాత్రి 8.00 గంటలు వరకు మరో బ్యాచ్ అందుబాటులో ఉంటారు కావున కాల్ చేయవచ్చు. దగ్గర్లోని సచివాలయ మ్యాప్ చూసి సంబంధిత శానిటేషన్ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ నేరుగా సంప్రదించే అవకాశం కూడా ఉంది.
ICCC ద్వారా అనంతపురం నగరం పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని నగరపాలక సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమంలో EE షాకీర్ హుస్సేన్, TPO ఓంకార్, అమెనిటీస్సెక్రెటరీస్ నవీన్ కుమార్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నార