ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ, కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాయపూడి వారు ROC.No.13033/114/2026/H1, తేదీ: 14-09-2026 ద్వారా అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ని 62 వార్డులుగా విభజిస్తూ (Delimitation) ఉత్తర్వులు జారీ చేసినారు.
అందువలన, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పోరేషన్ ( వార్డుల పునర్విభజన) నియమాలు, 1994 లోని రూల్ 11 ప్రకారం, అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజలందరికీ ఇందుమూలంగా తెలియజేయడమైనది ఏమనగా, అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 62 వార్డుల విభజన (Delimitation) ప్రక్రియ ఖరారు చేయబడినది.
అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కి సంబంధించిన *62 వార్డుల తుది విభజన వివరాలు ఫారం-VI (Form-VI)*లో పొందుపరచబడినవి. సదరు వార్డుల విభజన వివరాలు ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించబడినవి.
ప్రజల సౌకర్యార్థం, ఫారం-VIలో పొందుపరచబడిన 62 వార్డుల తుది విభజన వివరాలను అనంతపురం తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం మరియు అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నోటీసు బోర్డులపై ప్రచురించడమైనది.
కావున, అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్లుపై సమాచారాన్ని గమనించగలరు.