అనంతపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం
అనంతపురం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో శనివారం ఈ నగరపాలక సంస్థ కమిషనర్ యం. జస్వంత రావు, MHO డాక్టర్. రాజా రవీంద్ర తో కలిసి పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ముఖ్యమంత్రి బళ్లారి రోడ్డులోని MYR కళ్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకకు హాజరవుతున్నట్లు అధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో శిల్పారామం జోన్, MYR కళ్యాణ మండపం హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే కమిషనర్ ఎలిప్యాడు నుండి MYR ఫంక్షన్ హాల్ వరకు ప్రధాన రహదారి వెంబడి చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు డివైడర్ల మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లు, గుబురుగా ఉన్న పొదలు మరియు చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను JCB లు మరియు ట్రాక్టర్ల సహాయంతో తొలగించి, రోడ్డు మార్జిన్లను శుభ్రం చేశారు.అదేవిధంగా మురుగు కాలువలలో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడడం, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేయించడం జరిగింది. కాన్వాయ్ రూట్ లో ఎక్కడా చెత్త కనిపించకుండా, నగరం పరిశుభ్రంగా కనిపించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శులు, మేస్త్రీలు మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక బళ్లారి రోడ్డు కూడలిలోని అన్నా క్యాంటీన్ ను గురువారం సందర్శించారు.
అన్నా క్యాంటీన్ లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. క్యాంటీన్ కు విచ్చేసిన ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి ఆహార నాణ్యతను, నిర్వాహకుల వ్యవహార శైలిని అడిగి తెలుసుకున్నారు.
క్యాంటీన్ ప్రాంగణంలో తాగునీటి వసతి, మరుగుదొడ్లు నిర్వహణ తీరును పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరిగా పాటిస్తూ నిర్దేశించిన ప్రమాణాలను క్యాంటీన్ నిర్వాహకులు చేపట్టాలని కమిషనర్ సూచించారు.