క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం*
♦️వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు
**
పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు*
♦️ కమిషనర్ మయూర్ అశోక్*
*గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్స్ అంటించే వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని, సదరు కేసు మేరకు భాధ్యులకు షుమారు 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. నగరంలో వాల్ పోస్టర్స్ అంటించడం నిషేధమని, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ కూడా నిర్దేశిత అనుమతులు తీసుకొని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలోని ఫ్లెక్సి, వాల్ పోస్టర్స్ ప్రింటర్స్, వివిధ మతాలకు చెందిన పెద్దలు, సినిమా ధియేటర్ల యజమానులతో క్లీన్ గుంటూరులో భాగంగా పోస్టర్ ఫ్రీ సిటిపై సమావేశం జరిగింది.