అనంతపురం: నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత రావు రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం కొవ్వూరు నగర్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

నగరంలోని పబ్లిక్ హెల్త్ వర్కర్లు అందరూ తప్పనిసరిగా ఆప్రాన్ ధరించి విధులకు హాజరు కావాలని కమిషనర్ ఆదేశించారు. ఆప్రాన్ ధరించడం ద్వారా పబ్లిక్ హెల్త్ వర్కర్లు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, విధి నిర్వహణలో వారి భద్రతకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

పబ్లిక్ హెల్త్ వర్కర్లు తప్పనిసరిగా ఆప్రాన్ ధరించి మాత్రమే విధులకు హాజరయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలను ఆయన ఆదేశించారు.

అనంతరం బళ్లారి రోడ్డులోని అన్నా క్యాంటీన్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న అల్పాహారం నాణ్యత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.

About The Author