వీఎంఆర్డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష. రహదారులు, తాగునీరు, యూజీడీ, డ్రైనేజీ, వీధిదీపాలు, చెత్త నిర్వహణపై అధికారులతో సమగ్రంగా చర్చ
– రూ.10,200 కోట్లతో రక్షిత తాగునీటి పైపులైన్లు, రూ.4,200 కోట్లతో యూజీడీ పనులు చేపడుతున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించడమే మా లక్ష్యం.
– అన్ని మున్సిపాలిటీల్లో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రూ.5,500 కోట్లు మంజూరయ్యాయి.. యూజీడీ, తాగునీటి పనులు పూర్తైన వెంటనే రోడ్ల పనులు చేపడతాం.
– వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల చెత్తలో ఇప్పటికే 140 లక్షల టన్నులు తొలగించాం.. చెత్త నుంచి సంపద, విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ పరిశుభ్రమైన పట్టణాలను నిర్మిస్తాం.
– ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు Sundarapu Vijay Kumar Jsp , Madhavi Lokam , మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్, వీఎంఆర్డీఏ ఇన్చార్జ్ కమిషనర్ కేతన్ గార్గ్, నర్సీపట్నం, విజయనగరం, నెల్లిమర్ల, ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.