గుంటూరు: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం జేకేసి కాలేజి ముందస్తు పన్నురూ.18.49 లక్షల చెక్ ని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ కి ప్రిన్సిపాల్ పి.గోపిచంద్ అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముందస్తు పన్ను చెల్లించిన జేకేసీ కాలేజీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఈ నెల 30లోపు ఆస్తి పన్నుని ఏక మొత్తంగా చెల్లిస్తే పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. నగరంలోని ఆస్తి, ఖాళీ స్థలపన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా పన్ను సేకరణ క్యాష్ కౌంటర్లు సెలవు రోజులతో సహా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.