జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు
జనగణన–2027 స్వీయ గణన (16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు)
జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది:
House Listing Operations : 01 మే నుండి 30 మే 2026 వరకు

అనంతపురము నగర పాలక సంస్థ పరిధిలో జనగణన–2027 సంబంధించిన ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమంను కమీషనర్ జస్వంత రావు ఈ రోజు 15-04-2026 న ప్రారంభించారు.

ఈ శిక్షణ కార్యక్రమం కె.యస్.ర్ గవర్నమెంట్ బాలికల జూనియర్ కాలేజ్ లో క్రింది షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడుతోంది.

Batch–I : 15, 16, 17 ఏప్రిల్ 2026
Batch–II : 21, 22, 23 ఏప్రిల్ 2026

ఈ శిక్షణలో మొత్తం 437 మంది ఎన్యూమరేటర్లు, 87 మంది సూపర్వైజర్లు, 14 మంది ఫీల్డ్ ట్రైనర్లు నియమించడం జరిగినది మరియు 7 తరగతి గదుల్లో (ప్రతి గదికి 2 మంది ట్రైనర్లు) ఈ శిక్షణా కార్యక్రమం ను ఏర్పాటు చేశారు.

జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది:
Self Enumeration : 16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు
House Listing Operations : 01 మే నుండి 30 మే 2026 వరకు

ఈ జనగణన కార్యక్రమం పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతూ, మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్ ద్వారా డేటా సేకరణ జరుగుతుంది. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది.

ఈ సందర్భంగా, అనంతపురము నగర ప్రజలు జనగణన కార్యక్రమానికి సహకరించి, సరైన సమాచారాన్ని అందించాలని నగర పాలక సంస్థ, కమీషనర్ జస్వంత రావు విజ్ఞప్తి చేశారు.

About The Author