కాకినాడ  :
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నాయి.. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా  ఫీల్డ్ విజిట్ నిర్వహిస్తూ డేటా సేకరణ విధానం, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు.
కాకినాడ రామారావుపేటలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీల్డ్ స్థాయిలో డేటా సేకరణ పద్ధతులు, మొబైల్ యాప్ వినియోగం, అలాగే సర్వే సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో పాల్గొన్న సిబ్బంది మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న జనగణన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు పూర్తి స్థాయిలో సమాచారం అందించి సహకరించాలని కమిషనర్ కోరారు.

About The Author