– రహమత్ నగర్ పారిశుద్ధ్య పనుల పరిశీలించారు.
– తరువాత గాంధీ బజార్, ఓల్డ్ టౌన్, కూరగాయల మార్కెట్, పైప్ లైన్ రోడ్డు, వేణుగోపాల్ నగర్, రామచంద్ర నగర్*: స్వీపింగ్ పనులు తనిఖీ చేయడం జరిగింది. అక్కడినుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ద్వారకా నగర్, మాతంగి నగర్, తపోవనం నుండి బళ్లారి బైపాస్ వరకు జనశక్తి నగర్ సర్వీసు రోడ్డు నందు స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనుల పరివేక్షించారు.
–
1.అనంతరం 1వ సర్కిల్ 5వ సర్కిల్ శానిటేషన్ సెక్రటరీలతో పారిశుద్ధ్య పనుల పనితీరు గురించి ఆరా తీశారు.
2. స్వచ్ఛ సర్వేక్షన్ 2026 ఫీడ్‌బ్యాక్ నమోదు వివరాలను ఆరా తీశారు.
3. పాతూరు కూరగాయల మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ షాపుల యజమానులతో చెత్త కింద వేయకూడదని సూచించారు..
4. తోపుడుబండ్లు, టీ స్టాల్ వ్యాపారస్తులు రోడ్డుపై చెత్త వేయకుండా చూడాలని శానిటేషన్ సెక్రటరీలను ఆదేశించారు.
5. వ్యాపారస్తులందరూ తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకునేలా పర్యవేక్షించాలని సెక్రెటరీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన శానిటేషన్ ఇన్స్పెక్టర్లు శివయ్య, గోపాల్, శానిటేషన్ సెక్రటరీలు వీరేష్ కుమార్, అనిత రాణి స్వర్ణలత, హేమలత, పెద్ద ఆంజనేయులు, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు