భీమవరం: స్థానిక మున్సిపాలిటీలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో పి.యమ్. స్వనిది 2.0 కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగ వీధివిక్రయదారులకు రుణాల మంజూరు, క్రెడిట్ కార్డ్ అందజేయడం జరిగింది. మొత్తం 466 మంది వీధి విక్రయదారులకు ఒక కోటి 18 లక్షలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్ర రెడ్డి హాజరు కాగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ A.రాంబాబు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హెప్సిబా, కార్మిక అసిస్టెంట్ కమిషనర్ ఏ. లక్ష్మీ, మెప్మా CMM శివప్రసాద్, సిఓ సత్యనారాయణ , బ్యాంకు అధికారులు , మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.

About The Author