ఏపీలో కొత్త ఏడాది వేళ పలువురు మున్సిపల్ కమిషన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొందరికి షాకులిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు వివిధ హోదాల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. వీరిని తక్షణం బదిలీ అయిన కొత్త ప్రాంతాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్రంలో ఇవాళ జరిగిన బదిలీల్లో అనంతపురం డిప్యూటీ కమిషనర్ గా ఉన్న పావనిని పార్వతీ పురం మున్సిపల్ కమిషనర్ గా మార్చారు. పార్వతీపురంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కిషోర్ కుమార్ ను అక్కడి నుంచి సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నరసాపురం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అంజయ్యను అనంతపురం మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేసారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్ వెంకట్రామిరెడ్డిని నరసాపురం మున్సిపల్ కమిషన్ గా బదిలీ చేశారు.

టిడ్కో జనరల్ మేనేజర్ గా ఉన్న శారదా దేవిని తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ లో అదనపు కమిషనర్ గా బదిలీ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సహాయ కమిషనర్ గా ఉన్న కొండయ్యను పెడన మున్సిపాలిటీ కమిషనర్ గా పంపారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మంజునాథ్ గౌడ్ ను ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్ గా పంపారు. అలాగే వెయిటింగ్ లో ఉన్న డానియల్ జోసఫ్ ను చీరాల మున్సిపల్ కమిషనర్ గా పంపారు.

చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న అబ్దుల్ రషీద్ ను సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కడప కార్పోరేషన్ శానిటరీ సూపర్ వైజర్ గా ఉన్న లక్ష్మీనారాయణను రాజంపేట మున్సిపల్ కమిషనర్ గా మార్చారు. రాజంపేట మున్సిపల్ కమి,నరర్ గా ఉన్న అతని అసలు పోస్టు అయిన కర్నూలు కార్పోరేషన్ లో శానిటరీ ఇన్ స్పెక్టర్ గా మార్చారు. భీమిలి జోనల్ కమిషనర్ గా ఉన్న ఇపినాయుడిని మథురవాడ 2 జోనల్ కమిషనర్ గా మార్చారు. వెంకటగిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని నందికొట్కూరు కమిషనర్ గా పంపారు. నందికొట్కూరులో ఉన్న ఎస్ బేబీని సీడీఎంఏలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వెయిటింగ్ లో ఉన్న శ్రీధర్ ను కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా పంపారు. అక్కడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని అతని మాతృశాఖ జీఏడీకి మార్చారు.

About The Author