కొత్త సంవత్సరంలో ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ ప్రారంభించింది. నేటి నుంచి ఊరూరా గ్రామసభలు నిర్వహిస్తుంది. ఈ గ్రామసభల్లో రాజముద్రతో తయారు చేసిన కొత్త పాసు పుస్తకాలను జనవరి 9వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. గత వైసీపీ హయాంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నాటి సీఎం జగన్‌ బొమ్మలతో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణి జరిగింది.

దీనిపై రైతుల నుంచి అప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణి చేస్తామని, రైతులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా జనవరి 2 నుంచి పంపిణీకి కావాల్సిన నూతన పుస్తకాలను సిద్ధం చేసింది రెవెన్యూ శాఖ. గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పాటు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. కీలక మార్పులు.. గత వైసీపీ హయాంలో రీసర్వే చేసినప్పుడు అనేక మంది రైతులకు వెబ్‌ల్యాండ్‌లోని వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీనిపై అప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం అధికారులతో తీవ్రస్థాయిలో మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీపై వ్యతిరేకత తెచ్చిపెట్టింది. కూటమ అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలలోని వివరాలు, పాత వెబ్ ల్యాండిగ్ వివరాలు సేకరించి.. రైతుల వద్ద నుంచి కూడా డేటా సేకరించింది. అన్ని సరి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ చేసి.. కొత్త పుస్తకాల జారీకి ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి తప్పులు లేని పాస్‌పుస్తకాలు అందజేసే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది. బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ..

కొత్త పాస్ బుక్స్ ను బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారు. దీని ద్వారా ఈ కేవైసీ పూర్తి కాని వారికి సమస్య లేకుండా ఉంటుంది. అదే విధంగా ఎంత మందికి పంపిణీ పూర్తైందనే సరైన లెక్క కూడా ప్రభుత్వం వద్ద ఉంటుంది. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవడంతో పాటు.. ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేసి.. పాత భూహక్కు పత్రాలు(బీహెచ్‌పీ) వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వివరాలు తప్పుగా ఉంటే నూతన పాస్ పుస్తకాలు పంపిణీ సమయంలో కూడా పట్టాదారుని వివరాలు తప్పుగా నమోదైతే.. వాటిపై తక్షణ చర్యలకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. తహసీల్దార్ల లాగిన్ ద్వారా.. లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా ఏర్పాట్లు చేశారు. భూమి విస్తీర్ణం తప్పుగా నమోదైనా, చనిపోయిన వారి పేరు తో పాసు పుస్తకాల విడుదలైన వాటిని సరి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

About The Author