నగరంలో ప్రత్యేకంగా అన్నీ స్మశానవాటికల్లో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ జస్వంత్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే నవోదయ కాలనీ వద్ద ఉన్న స్మశానవాటికను కమీషనర్  పర్యవేక్షించారు. ముఖ్యంగా స్మశానవాటికల్లో లైటింగ్, నీటి వసతి  మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణాల కొరకు అంచనాలు తయారు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, త్వరితగతిన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెత్త నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకుని అనంతను సుందరనగరంగా మార్చాలన్నారు. నగర సుందరకరణలో ప్రజల భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉండాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయడం, కాలువల్లో ప్లాస్టిక్ గాజు పీస్ తదితర వ్యర్థాలను వదిలేయడం ద్వారా చెత్త పేరుకుపోయి, కాలువలు బ్లాక్ అయ్యే సమస్య లేకపోలేదు అన్నారు. అనంతరం నగరములో వివిధ ప్రాంతాల్లోని బళ్లారి బైపాస్, కళ్యాణ్ దుర్గం బైపాస్ సర్విస్ రోడ్డు , ఫ్లైఓవర్ బ్రిడ్జిల క్రింద ప్రాంతాలను పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణదారులు, చికెన్ వ్యాపారులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబందించి అదికారులకు హెచ్చరించారు. కమిషనర్ వెంట ప్రజా ఆరోగ్య అధికారులు తదితరులు ఉన్నారు. నగరంలోవ్యాపార సముదాల ఏరియాలలో వ్యాపారులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, నగర సుందరీకరణలో భాగస్వాములు కావాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు.తదుపరి బళ్లారి రోడ్డులోని అన్నక్యాంటీన్‌ను సందర్శించి అల్పాహారం పంపిణీని పరిశీలించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి ఆహార నాణ్యత, సిబ్బంది పనితీరు మరియు సమయపాలనపై వివరాలు తెలుసుకున్నారు. సేవలను మరింత మెరుగుపరచి ప్రజలలో సానుకూల అభిప్రాయం పెంపొందేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ (I/c) బి ఎల్ నరసింహ, ఇంజనీరింగ్ అదికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు , శానిటేషన్ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

About The Author