కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స అందించి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కమిషనర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు సూచించారు.