కాకినాడ, ఏప్రిల్ 18 :
కాకినాడ నగరంలో మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలు విడుదల చేశారు.అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వచ్చే 800 ఎంఎం మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడటంతో మరమ్మత్తులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఏప్రిల్ 20, 2026 సాయంత్రం నుంచి ఏప్రిల్ 21, 2026 ఉదయం వరకు మంచినీటి సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. అనంతరం అదే రోజు సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుందని వెల్లడించారు.
ఈ అంతరాయం నగరంలోని 5, 6వ డివిజన్లు మరియు 14 నుండి 49వ డివిజన్ల పరిధిలోని ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు పేర్కొన్న అధికారులు, అవసరమైతే క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని
సంప్రదించవలసిన నంబర్లు
6301387834, 7382042977, 9948022954, 9059296885*
కోరారు:.