గుంటూరు : అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) ను వినియోగించుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు .

♦️ గతంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు ఈ 23వ తేదీతో ముగియనుంది .

♦️ క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడవు.

♦️ మౌలిక సదుపాయాలు సదరు లేఅవుట్‌లలో రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించబడవు.

♦️ ప్లాట్ల అమ్మకం లేదా కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

♦️ గడువు ముగిసిన తర్వాత అనధికార లేఅవుట్‌లపై కఠిన చర్యలు .

♦️ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చిన కమిషనర్

♦️ ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారదర్శకంగా తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని కకోరిన కమిషనర్

About The Author