అనంతపురం నగరపాలక సంస్థ: నగర కమీషనర్ జస్వంతరావు  మున్సిపల్ ఇంజనీర్లతో నగరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

నగరంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అందరు ఇంజనీర్లకు కమీషనర్  ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిబంధనలను పాటిస్తూ నగరంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమీషనర్ గారు ఆదేశించారు.

నగరంలో కాలువల డీసిల్టేషన్ పనులను కూడా పూర్తి చేసే విధంగా కార్యాచరణ తయారు చేసుకొని వాటిని పూర్తి చేయవలసిందిగా కమీషనర్ గారు ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశానికి SE రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు షాకీర్ హుస్సేన్, చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహులు ,సుభాష్ చంద్రబోస్, దాక్షాయని, సత్యనారాయణ, ఇంచార్జ్ ఏఈ లు మరియు సంబంధిత ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది హాజరు కావడం జరిగినది.

About The Author