కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ
ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం ఈ సోమవారం కూడా నగర పాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
డ్రైనేజీ సమస్యలు, వీధిలైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 14 అర్జీలు అందగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు కమిషనర్ సూచించారు.అంతకుముందు నిర్వహించిన “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమంలో ఇద్దరు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్,, టిపిఆర్వో శైలజ, ,ఈ ఈ కనకారావు , మేనేజర్ శిరీష్ కుమార్ ,సచివాలయ ఉద్యోగులుతదితర అధికారులు పాల్గొన్నారు.

About The Author