అనంతరం నగరంలోని ఉమా నగర్-02, ప్రభాకర్ వీధి, ఫెర్రర్ కాలనీ, ఓల్డ్ టౌన్ ట్యాంకు, జనశక్తి నగర్ మరియు ఎరుకల వారి వీధి- 01 స్వర్ణ వార్డులలో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించడం జరిగినది. అందరూ శానిటేషన్ సెక్రటరీలు ఉదయం క్షేత్రస్థాయిలో విధులకు హాజరయ్యే విధంగా పర్యవేక్షించుకోవాలని అందరూ శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ గారు ఆదేశించడం అయినది  నగరంలో , 24 గంటల్లో చెత్తకుప్పలను తొలగించుట మరియు కాలువ పూడికల పనులు నిర్వహించేలా అందరూ శానిటేషన్ సెక్రటరీలు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించుకోవాలని కమిషనర్ గారు ఆదేశించారు.

తదుపరి అన్నా క్యాంటీన్ బళ్లారి రోడ్డును సందర్శించి, అన్నా క్యాంటీన్ కు వచ్చే ప్రజలకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ, పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నా క్యాంటీన్ సిబ్బందికి సూచించారు.

About The Author