ప్రస్తుత వేసవి దృష్ట్యా నిడదవోలు-మొగల్తూరు కెనాల్ క్లోజర్ (కట్టివేత) కారణంగా నరసాపురం పురపాలక సంఘమునకు చెందిన మంచినీటి చెఱువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) యొక్క నీటి నిల్వలు తగ్గుచున్నందున మరియు విజ్జేశ్వరం నరసాపురం కాలువకు భారీవ్యయంతో మరమ్మత్తులు మరియు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో సాగునీరు విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున నరసాపురం పట్టణ ప్రజలకు ది.15.05.2026వ తేది నుండి రోజుకు ఒక్కపూట మాత్రమే మంచినీటి సరఫరా చేయబడునని తెలియజేయడమైనది. కావున పట్టణ ప్రజలు మంచినీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకొనవలసినదిగా తెలియజేయడమైనది. అంతియే కాకుండా మంచినీటి సరఫరా సమయంలో మోటార్లు వినియోగించకూడదని మరియు జనరేటర్లతో కూడా మోటార్లు వినియోగించకూడదని తెలియజేయుచూ పట్టణ శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరుగుటకు పట్టణ ప్రజలు పురపాలక సంఘ వారికి సహకరించవలసినదిగా కోరడమైనది.

About The Author