ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన “SASA (స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర)” కార్యక్రమం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న నీరు ప్రగతి వనం పార్కు నందు ఈ రోజు ఘనంగా నిర్వహించడ్డమైనది. ఈ కార్యక్రమం “జలధార – జలహారతి” అనే ప్రాధాన్యమైన ఇతివృత్తంతో జరిగింది
.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్, భవాని రవి కుమార్ గారు, పర్యవేక్షక ఇంజనీర్ (SE) రాజశేఖర్ ఇన్‌చార్జ్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ గారు నీరు ప్రగతి వనం పార్కు లో ఉన్న ఇంకుడు గుంతలను పరిశీలించారు మరియు ఆదేవిదంగా నగరంలోని అన్నీ పార్కు లలోని ఇంకుడు గుంతలు పనిచేసేలా పర్యవేక్షించు కోవాలని కోరడమైనది. తదుపరి SE,రాజశేఖర్ ఇన్‌చార్జ్ కమిషనర్ గారు మాట్లాడుతూ అనంతపురం నగర ప్రజలు నీటి వృదాను అరికట్టాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీరు లేనిదే జీవం లేదని, నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్తు తరాలకు భద్రమైన వనరులను అందించవచ్చని పేర్కొన్నారు.
అనంతరం హాజరైన సిబ్బంది చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, AD హర్టీకల్చర్ లక్ష్మయ్య, నరసింహ మున్సిపల్ ఆరోగ్య అధికారి (I/c), నాగ సుబ్బరాయుడు, TPRO MEPMA, కాటమయ్య CMM MEPMA,వెంకటేష్, స్వచ్ఛ ఆంధ్ర IEC సమన్వయకర్త, అనంతపురం, MEPMA COs రిసోర్స్ పర్సన్స్ మరియు SHG గ్రూప్ సభ్యులు హాజరుకావడం జరిగినది.