కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవా లని నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.వెంకట్రా వు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కర వ్యవస్థలో ఎస్.ఇ.పి.వెంకట్రావు పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
మొత్తం 5 అర్జీలు అందగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు ఆయన సూచించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర కమిషనర్ కార్యక్రమంలో ముగ్గురు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ కె.శ్రీనివాస్,, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీచరణ్, డిసిపి కృష్ణారావు, ఇఇ కనకరావు, మేనేజర్ శిరీష కుమార్, తదితరులు పాల్గొన్నారు.