అనంతపురం: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి హానికరమని దృష్టిలో ఉంచుకుని, నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మరియు శానిటేషన్ సెక్రటరీలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నగరంలోని 4వ సర్కిల్ పరిధిలో వేణుగోపాల్ నగరు , 3వ సర్కిల్ పరిధిలో రాజు రోడ్డు కమల నగర్ , అశోక్ నగర్ వ్యాపార సముదాయాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ప్రదేశాలలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు మరియు స్ట్రీట్ వెండర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా సుమారు 22 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీనం చేసుకొని, సంబంధిత వ్యాపారులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ. 22,250/-జరిమానా విధించడం జరిగింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించి వాటిని మురికి కాలువలలో వేయడం వల్ల కాలువలు మూసుకుపోయి, పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్ల నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు, మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ప్రజలు, వ్యాపారులు మరియు స్ట్రీట్ వెండర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని కమీషనర్ గారు సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలకు నగర ప్రజలందరూ సహకరించి, స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి తోడ్పడాలని కమీషనర్ గారు విజ్ఞప్తి చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో నరసింహులు, ఎం.హెచ్.ఓ (I/c), శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు విజయ్ కుమార్, ఆంజనేయులు, గోపాల్, నాగరాజు, గానే నాయక్, శివయ్య శానిటేషన్ సెక్రటరీలు సాయినాథ్, హరి,వెంకటయ్య,శ్రీదేవి వసుంధర, ప్రదీప్, ఇస్మాయిల్, భాస్కర్ మేస్త్రీలు నాగేంద్ర,మురళి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

About The Author