అనంతపురం నగరపాలక సంస్థ:
ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 పురస్కరించుకొని అనంతపురం నగరంలో DM&HO కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీలో జిల్లా మలేరియా విభాగ అధికారులు, అనంతపురం నగరపాలక సంస్థ మలేరియా అధికారులు, హెల్త్ సెక్రటరీలు మరియు ఆశ వర్కర్లు మలేరియా నివారణపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేసారు.
జిల్లా మలేరియా అధికారి ఓబులు గారు మాట్లాడుతూ మలేరియా నివారణ కోసం జిల్లా మలేరియా విభాగము మరియు అనంతపురం నగరపాలకసంస్థ సంయుక్తంగా కృషి చేస్తూ నగరంలో కాలువలు శుభ్రపరచడం, పారిశుద్ధ్యం మెరుగుపరుస్తూ అనంతపురం నగరంలో మలేరియా ను పూర్తిగా నివారించేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి ఓబులు గారు, జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారులు, మలేరియా సబ్-యూనిట్ అధికారులు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మలేరియా ఫీల్డ్ అసిస్టెంట్ శంకరయ్య, స్వచ్ఛ ఆంధ్ర (అనంతపురం జిల్లా) ఐఈసీ కోఆర్డినేటర్ వెంకటేష్, హెల్త్ సెక్రటరీలు మరియు ఆశ వర్కర్లు హాజరు కావడం జరిగినది.