కాకినాడ, మే 2: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులపై నిర్లక్ష్యం సహించబోమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ హెచ్చరించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్‌తో కలిసి ఆయన పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

పరిశీలన సందర్భంగా అనేక ప్రాంతాల్లో సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు శానిటేషన్ మేస్త్రీలు ఫీల్డ్‌లో లేకపోవడం గమనించిన అదనపు కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారి పర్యవేక్షణ లోపం వల్లే పారిశుద్ధ్య నిర్వహణ సంతృప్తికరంగా సాగడం లేదని పేర్కొన్నారు. అలాగే శానిటేషన్ మేస్త్రీలు కూడా క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం గమనించి, వారి పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇకపై శానిటేషన్ సెక్రటరీలు ప్రతి రోజు ఉదయం ఫీల్డ్‌లో తప్పనిసరిగా ఉండాలని, పనులను సమీక్షించి శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు డైలీ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. తమ పరిధిలోని ప్రతి ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా మధ్యాహ్నం వేళ నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లను ప్రత్యేక డ్రైవ్ ద్వారా శుభ్రపరచాలని అ
ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చెత్త పేరుకుపోవడం లేదా డ్రైన్లు మూసుకుపోవడం వంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

పారిశుద్ధ్య నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ హెచ్చరించారు.

About The Author