దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్
♦️ గురువారం శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు ఇళ్లలో ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించారు.
♦️ నగరవ్యాప్తంగా మిగిలి ఉన్న ఇళ్ల గణనను రాబోయే 2 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
♦️ ఎన్యూమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ వివరాలు, పిన్ లేదా ఓటీపీ అడగరన్న కమిషనర్
♦️ ఒక్కో ఇంటికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఖచ్చితమైన వివరాలు అందించి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన కమిషనర్
♦️ జన గణనపై సందేహాలకు జిఎంసి కాల్ సెంటర్ 📞 0863-2345105 (ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు)