భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని గుంటూరు నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యుటీ కమిషనర్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరియు దేశంలో సామాజిక సమానత్వం పెంపొందించడానికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడని, ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు మరియు సిబ్బంది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ శాంతి కళ, మేనేజర్ బాలాజీ బాషా, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author