గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మీడియా డివైస్ డిస్ల్పే ఫీజుల బకాయిలు నూరు శాతం వసూలు చేయాలని, ఫీజులు చెల్లించని బోర్డ్ ల తొలగింపు చేపట్టాలన్నారు. అనధికార బోర్డ్ ల పై ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డ్ ల వారీగా వాటిని తొలగించడానికి ప్లానింగ్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల నుండి వచ్చిన యల్.ఆర్.యస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని, కార్యదర్శుల వద్ద ఉన్న దరఖాస్తులు ఈ నెల 20 లోపు పరిష్కరించాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ కి సంబంధించి టి.డి.ఆర్ బాండ్లు పెండింగ్ లేకుండా, భూములు అందజేస్తున్న యజమానులకు అందజేయాలన్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్ అయిన పీకల వాగుపై ఉన్న ఆక్రమణలకు సంబంధించి మ్యాపులను అందజేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రజలు భవన నిర్మాణాల సమయంలో నిర్మాణ సామగ్రి రోడ్లపై వేయుట వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్యదర్శులు వారి వారి సచివాలయాల పరిధిలో బిల్డింగ్ మెటీరియల్ రోడ్లపై వేయకుండా చూడాలని, ఎవరైనా వేస్తె వారికి అపరాధ రుసుము విధించి, సదరు మెటీరియల్ ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు భవన నిర్మాణ సామగ్రిని వారి స్థలంలోనే వేసుకునేలా చూడాలన్నారు. అలాగే రోడ్లు మరియు రోడ్డు మార్జిన్ల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని నామమాత్రంగా తొలగిస్తున్నారని, మెయిన్ రోడ్లపై ఆక్రమణల తొలగింపుకు టిపిఎస్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీ గా చేయాలని, ఎవరైనా పోస్టర్లు అంటించినట్లైతే వారికి ఫోన్ చేసి హెచ్చరించాలని, భవిష్యత్ లో వారు పోస్టర్లు అంటించకుండా చర్యలు తీసుకోవాలని,ప్రస్తుతం అంటించిన పోస్టర్లను తొలగించాలన్నారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ లు, టిపిబిఓలు, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.