Bhimavaram: 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం ప్రజలకు తమ కుటుంబ, గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే Self-Enumeration సదుపాయాన్ని కల్పించిందని పులపాలక సంఘ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి బుధవారం తెలిపారు.

ఈ సదుపాయం ద్వారా పౌరులు అధికారిక పోర్టల్‌ను సందర్శించి, సుమారు 15–20 నిమిషాల్లో అవసరమైన వివరాలను నమోదు చేసి, ఒక ప్రత్యేకమైన *SE ID* ను పొందగలరు. ఈ విధానం పూర్తిగా డిజిటల్, సులభమైన పేపర్‌లెస్ ప్రక్రియ.

Self-Enumeration ప్రక్రియ:

1. సంబంధిత అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి
2. రాష్ట్రం, జిల్లా వంటి వివరాలు ఎంచుకుని లాగిన్ అవ్వాలి
3. కుటుంబ ప్రధానుడు (Head of Family) ఇతర సభ్యుల వివరాలు నమోదు చేయాలి
4. ఇంటి నిర్మాణం, సౌకర్యాలు (నీరు, విద్యుత్, LPG), ఆస్తుల వివరాలు నమోదు చేయాలి
5. ఫారమ్‌ను సమర్పించి (Submit) ప్రత్యేకమైన SE ID పొందాలి

ముఖ్యమైన సూచనలు:

* నమోదు చేసే వివరాలు నిజమైనవిగా ఉండాలి
* తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది
* ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు SE ID చూపితే సరిపోతుంది
* వ్యక్తిగత డేటా గణాంక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతుంది

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్దేశిత గడువులోగా Self-Enumeration పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.

About The Author