అనంతపురం: నగరంలోని 6 సర్కిల్ ల పరిధిలో నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారస్తుల పైన రూ.14,200 జరిమానా విధించడం జరిగింది.
నగరవాసులు నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీలకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సునీత, 6 సర్కిల్ లకు సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు, సంబంధిత శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.