అమలాపురం: స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ కె.వి.వి.సత్యనారాయణ, ఏఈ కె.వెంకటేష్, మున్సిపల్ మేనేజర్ డి.ప్రభాకర రావు,ఆర్. వో బి.శ్రీలక్ష్మి, యూ.ఎస్.వో గుత్తుల శ్రీహరి, మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డు సెక్రెటరీలు, మెప్మా సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు.