అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ,స్వచ్చ్ సర్వేక్షన్ :2025-26 లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడానికి అమలాపురం పురపాలక సంఘం ద్వారా 5 లక్షల రూపాయలతో కనుగోలు చేసిన 350 తడి-పొడి చెత్త డబ్బాలు.
అలాగే రూ .10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 50 పుష్ కార్ట్ లను, పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం రూ.3 లక్షల రూపాయలతో కనుగోలు చేసిన రేడియం జాకెట్స్ ,చేతులకు రక్షణ తొడుగులు ( గ్లవ్స్) ,పట్టణంలో టెర్రస్ గార్డెన్స్ ,కిచెన్ గార్డెన్స్ చేస్తూ , ఇంటి వద్దనే తడి చెత్త నుండి హోమ్ కంపోస్ట్ తయారీ చేయడంలో ఆసక్తిని కలిగి ఉండి,కంపోస్ట్ తో పూల, పండ్ల మొక్కలను పెంచుతూ ,పట్టణ పరిశుభ్రత కోసం కృషి చేస్తున్న 62 మంది మహిళలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమకూర్చిన కంపోస్ట్ బిన్స్ ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్ కార్ట్ లను,బిన్స్ ను, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్స్ పంపిణీ చేయడం,మహిళలకు కంపోస్ట్ బిన్స్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించి పనులు చేపట్టాలని, పట్టణ పరిశుభ్రతకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యంపై , శుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. స్వచ్చ సర్వేక్షన్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడమే మన లక్ష్యం అని వెల్లడించారు.దానికోసం పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు,పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ,మాజీ కౌన్సిలర్స్, మున్సిపల్,సచివాలయ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.