భీమవరం: మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో డివిజన్లు, వార్డుల పునర్విభజన షెడ్యూల్ను Revise చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. డివిజన్లు, వార్డుల Draft ప్రతిపాదనలు రూపొందించేందుకు ఈనెల 26 వరకు గడువు ఇచ్చారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి సూచనలు తీసుకునేందుకు వారం రోజులు అంటే ఈ నెల 27 నుంచి వచ్చేనెల 3 వరకు సమయం ఉంటుంది. మే 30 నాటికి తుది పునర్విభజన ఖరారు చేసి ప్రభుత్వ గేజిట్ విడుదల చేస్తుందని తెలిపారు. మారిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని నగర పురపాలక సంఘాల్లో ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

About The Author