అమలాపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ  ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా   ‘జలధార – జలహారతి’అనే ఇతివృత్తం(థీమ్)తో అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనంలో  నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ పై పట్టణ ప్రజలకు, విద్యార్థులకు  అవగాహన కార్యక్రమాలను శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ , ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ కమీషనర్ వి.నిర్మల్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ,సిబ్బంది మంచి నీటి చెరువు వద్ద పూజలు చేసి,జల హారతి కార్యక్రమాన్ని చేశారు. అనంతరం మహాత్మా బసవేశ్వరుడు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పుష్ప మాలంకృతం చేశారు. స్వర్ణ ఆంధ్ర — స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జల ధార — జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.నీటి కుంతలు,చెరువులను,కాలవలు పరిశుభ్రంగా ఉండేటట్లు అందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణంలో  ఎస్.టి పి, ఎఫ్ .ఎస్.టి.పి ల గురించి,మురుగు నీరు శుద్ధి వ్యవస్థల  గురించి వివరించారు.మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ నీటి సంరక్షణ చర్యలలో భాగంగా ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి,భూగర్భ జలాలను మెరుగుపరచడానికి పట్టణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.ప్రజలు కూడా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలను మెరుగుపరచడానికి,నీటి సంరక్షణ ద్యేయంగా ప్రభుత్వం ప్రారంభించిన 100 రోజుల డ్రైవ్ లో చెరువులను పునరుద్ధరించడం ,ఫీడర్ ఛానళ్ల ప్రక్షాళన చేయడం జరుగుతుందని ,కాలవలు,చెరువులలో చెత్త ,ఇతర వ్యర్థాలు వేయకుండా పట్టణ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌరుల చేత జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి ఎం. దుర్గా రావు దొర , సీపీవో ఎం. మురళీ కృష్ణ, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ( గ్రామీణ నీటి సరఫరా విభాగం) ఎ.వి.ఎస్.రాజన్, తహసీల్దార్ వి.దివాకర్, మెప్మా పీడీ డి.పెంచులయ్య ,పట్టణ ప్రజానిధులు, మున్సిపల్ సిబ్బంది,స్వర్ణ వార్డు కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author